షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్న ఉప్పు,నిప్పు నేతలు

జనగామ,సెప్టెంబర్‌4  జనం సాక్షి: పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్టలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకాలం ఉప్పు ` నిప్పులా ఉన్న స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుని చక్కగా పలకరించుకున్నారు. ఇద్దరూ కలసి కూర్చోవడంతో సభికులంతా ఆసక్తిగా చూశారు. అది గమనించిన రాజయ్యకు ఏమనిపించిందో ఏమో కానీ మధ్యలోనే సడెన్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవలి కాలంలో కడియం, రాజయ్యల మద్య పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యారు.