షోయబ్‌తో కలిసి డ్యాన్స్‌కు సానియా రెడీ
హైదరాబాద్: హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నాచ్ బలియే 5టీవి రియాల్టీ షోలో నృత్యం చేయాడానికి అన్ని విధాల సిద్ధమయ్యారు. సెలిబ్రిటీ దంపతులు సానియా, మాలిక్ నృత్య ప్రదర్శన అందరీని ఆకర్షింస్తుందని చెప్పవచ్చు. రియాల్టీ షోలో అతిధి దంపతులుగా పాల్గొంటున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని సానియా మీర్జా మీడియాకు తెలిపింది. ఎంతో రిహార్సల్ చేశామని ఆమె చెప్పింది. సమన్వయం. కాస్తా కష్టమేనని స్టెప్పులు కూడా గుర్తుండవని ఆమె అన్నది. తన పెర్ఫార్మెన్స్ మీదనే తాను పూర్తి దృష్టి పెట్టానని, తాను బాగా చేయగలననే అనుకుంటున్నానని,క్రికెట్ తన పాషన్ అని, నాట్యం చేసిన ప్రతిభా కనబర్చాలని చూస్తానని అన్నారు. సానియా పాకిస్థాన్‌కు ప్రతినిధ్యం వహించాలని నేనేప్పుడు కోరలేదన్నాడు. నాచే బలియే రియాల్టీషో5 ఈ నెల 29వ తేది నుంచి ప్రతి శనివారం స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతొంది. ఈ షోకు ఈ ఏడాది బాలివుడ్ డ్యాన్సర్ శిల్పా శెట్టి కుంద్రా, ప్రముఖ దర్శకుడు సాజీద్ ఖాన్, కోరియెగ్రాఫర్ టెరెన్స్ లూయిస్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు.