సంక్షేమంలో తెలంగాణ నంబర్‌ వన్‌

45వేల కోట్లతో 40 రకాల సంక్షేమ పథకాల అమలు: చందూలాల్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌7(జ‌నం సాక్షి): సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి చందూలాల్‌ అన్నారు. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 45వేల కోట్లతో 40 రకాల సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్‌ నేతలు సీఎం పదవి కోసం కోట్లాడుతున్నారని విమర్శించారు. వివిధ పార్టీలకు చెందిన 500 మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అభివృద్దిని కోరుకుంటున్న వారు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఇంటికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయని అన్నారు. ఒకప్పుడు తాగునీటి ఇబ్బందుల వల్ల మహిళలు బిందెలతో ధర్నాలు చేసేవారని,ఇప్పుడు ఆపరిస్థితిలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ తాగునీరు అందిస్తున్నారని అన్నారు. మిషన్‌ భగీరథలో ప్రతీ పాఠశాలకు శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు రైతుబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్‌ అండగా నిలబడ్డారని అన్నారు. అంతే కాకుండా రైతు బీమా పథకం ద్వారా మరణించిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందించే బృహుత్తర పథకం అమలు కాబోతున్నదని వివరించారు. ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి రైతులకు పంటల సాయం అందించిన ధాఖలాలు లేవని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు సీఎం కేసీఆర్‌ పాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం సర్కార్‌ విద్యకు పెద్దపీట వేస్తోందని అన్నారు. కేజీ టు పీజీలో భాగం గా పాఠశాలల్లో ఇంగ్లిష్‌ విూడియం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థికి పౌ ష్ఠికాహరంతో పాటు యూనిఫాంలు, కంప్యూటర్‌ విద్యపై శిక్షణ ఇస్తోందని అన్నారు.