సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం ముందంజ

వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ బాబు
జనం సాక్షి కతలాపూర్
తెలంగాణ లో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది రకాల పెన్షన్ నుండి 45 లక్షల పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సార్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, బీడీ పెన్షన్లు పంపిణీ నిర్వహించారు, అనంతరం మండల కేంద్రంలో దూలు గంగాధర్ ధూంపేట శ్రీహరి దళిత బంధు షాపులు ప్రారంభించారు, సిరికొండ గ్రామంలో నరేష్ దళిత బంద్షా ప్రారంభించి అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరూ బాగుపడాలని ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. రైతుబంధు లాగానే దళిత బంధు కూడా అమలవుతుందని అన్నారు. మండలాలు సీఎం కేసీఆర్ గారి ద్వారా జగిత్యాల నిర్వహించిన సభలో మంచి శుభవార్త వింటారని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు లబ్ధి పొందారని, ఇంకా రానున్న కాలంలో మళ్ళీ తెరాస ప్రభుత్వం ఏర్పడుతుందని జోష్యం చెప్పారు. అప్పుడు దేశంలోనే అగ్రగా స్థానంలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ఫెడు చైర్మన్ లోకబాపురెడ్డి ,జెడ్పిటిసి నాగం భూమయ్య ,ఎంపీపీ జవాజి రేవతి గణేష్, కంటే నీరజ సత్యనారాయణ అన్ని గ్రామాల సర్పంచులు, ఫ్యాక్స్ చైర్మన్లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.