సంగ్మా కొత్త పార్టీ ప్రారంభం రేపు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్సీపీతో బంధం తెంచుకున్న పి.ఎ.సంగ్మా రేపు కొత్త పార్టీ ప్రారంభించనున్నారు. నేషనల్ పీపుల్& పార్టీని రేపు ఆయన ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రారంభిస్తారు. ఎన్సీపీ ఎంపీగా ఉన్న ఆయన కుమార్తె అగాథా సంగ్మా ఇప్పట్లో తండ్రి పార్టీలో చేరకపోవచ్చని భావిస్తున్నారు. పార్టీకి సంబంధించి పలు కీలక ప్రకటనలను రేపు చేస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అలోక్‌కుమార్ గోయల్ తెలిపారు.