సంపూర్ణంగా విద్యాసంస్థలు బంద్.

జనం సాక్షి ఉట్నూర్.
 ఉట్నూర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యజమానులకు ఉపాద్యాయులకు  విద్యాసంస్థలు బంద్ చేసి మద్దతు ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.యం ఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ యన్.రాజు మాట్లాడుతూ రాజస్థాన్ రాష్టం జలోర్ జిల్లా  సురనాలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో చదువు తున్న  బాలుడు కుండ నీళ్లు త్యాగడనని ఉపాద్యాయుడు కొట్టడంతో విద్యార్థి  మృతి చెందాడని   వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు.రోజు రోజుకు దళితుల పై దాడులు హత్యలు అవమానాలు జరుగుతున్న ప్రభుత్వం పటించుకోవడం లేదని ఆరోపించారు.బంజారా యువ సేన లంబాడీలా ఐక్యవేదిక తరుపున్న మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.రవి ఇమ్రాన్ అశోక్ హరీష్ మహేష్ బంజారా యువ సేన జిల్లా కార్యదర్శి రాథోడ్ మహేందర్,లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వసంత్ రావు ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.