*సంస్కారంతో కూడిన విద్యనందించాలి.
•దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి._
దోమ అక్టోబరు 15(జనం సాక్షి)
చదువు సంస్కారంతో కూడినదిగా ఉండాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె.రాజిరెడ్డి అన్నారు.శనివారం దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల,కేంద్ర ప్రాథమిక బాలికల పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశం,ఏక రూప దుస్తుల పంపిణి కార్యక్రమాల్లో పాఠశాలల చైర్మన్ లు బి.జ్యోతి.ఎండీ గౌస్ గ్రంథలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల చదువు సౌకర్యాలు చదువులో విద్యార్థుల చదువు తదితర విషయాలను చర్చించి తల్లీ దండ్రుల సూచనలు తీసుకోవాలన్న ఉద్దేశంతో తల పెట్టిన పేరెంట్స్ కమిటీ సమావేశంలకు పేరెంట్స్ హాజరు కాకపోవడం తో కొత్త పంత అవలంభించాలని సర్పంచ్ రాజిరెడ్డి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పురందాస్, నర్సింలులకు సూచించారు. విద్యార్థి డైరీలో సమావేశపు తేదిని చర్చించే అంశాలు క్లాస్ టీచర్ తో నమోదు చేయించి విద్యార్థులు వారి ఇంటి దగ్గర పేరెంట్స్ సంతకాలు తీసుకునే టప్పుడు ఉపాధ్యాయులచే మాట్లాడే విధానం అవలంభించాలని సూచించారు.ప్రతి క్లాస్ టీచర్ కు ఒక తరగతి అప్పజెప్పి నెలకోసారి విద్యార్థుల తల్లీ దండ్రులతో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య,సన్న బియ్యంతో భోజనం,ఏకరూప దుస్తులు ప్రవీణ్యం కలిగిన ఉపాధ్యాయ బృందంతో కూడిన విద్యను అందిస్తున్న విషయం పై మాట్లాడారు. డైరెక్టర్ యాదయ్యగౌడ్ పాఠశాల ల సౌకర్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.*