సచిన్ ఇంట్లో గిల్‌క్రిస్ట్
ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు సోమవారం ముంబయిలో సందడి చేశారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ తన 45 వజన్మదిన వేడుకలను సచిన్ తెందుల్కర్ ఇంట్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ గిల్‌క్రిస్ట్‌తో కేక్‌ను కట్ చేయించారు.సచిన్ తనను ఆశ్చర్యానికి గురి చేశారని.. ఆయన ఇంట్లో ఈసారి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని… కేక్‌పై ‘గిల్లీ’ అని సంబోధిస్తూ తనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారని గిల్‌క్రిస్ట్ తెలిపాడు. ట్విటర్ వేదికగా సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ట్వీట్‌కు స్పందించిన గిల్‌క్రిస్ట్ సచిన్‌కు ధన్యవాదాలు కూడా తెలిపాడు.