‘సచిన్ రిటైరయ్యే టైమ్ వచ్చింది’
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత కెప్టెన్‌గానే కాకుండా జట్టులో ప్లేయర్‌గా కొనసాగేందుకు కూడా ధోనీ అనర్హుడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమర్ నాథ్ సచిన్‌పై కూడా విమర్శలు సంధించాడు. టెండూల్కర్ రిటైర్మెంట్ సమయం వచ్చిందని, గౌరవంగా తప్పుకుంటే మంచిదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో సచిన్ గొప్ప ఆటగాడనడంలో సందేహం లేదని, గత రెండు దశాబ్ధాలుగా జట్టుకు ఎన్నో విదయాలం దించాడని చెప్పాడు. అయితే గతం లో మాదిరిగా మాస్టర్ పరుగులు చేయ లేకపోతున్నాడని, రిటైర్మెంట్ ప్రకటిం చడమే మిగిలిందని వ్యాఖ్యానించాడు. ప్రతీ ఆటగాడి జీవితంలో ఈ పరిస్థితి ఎదురవుతుందని తెలపాడు. ఇప్పటికే ధోనీపై అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యల కు పలువురు మాజీ ఆటగాళ్ళు కూడా మధ్ధతు పలికారు. కేవలం ప్రపంచకప్ గెలిచిన కారణంగానే ధోనీ జట్టులో కొనసాగుతున్నాడని అమర్‌నాథ్ వ్యా ఖ్యానించాడు. అలాగే కెప్టెన్సీ నుండి తప్పిస్తే జట్టులో ఉండేందుకు ధోనీకి అర్హత లేదని తీవ్ర స్థాయిలో విమర్శించాడు. గత ఏడాది ఆస్టేల్రియా, ఇంగ్లాండ్ పర్యటనల తర్వాత కెప్టెన్సీ నుండి ధోనీని తప్పించాలంటూ అమర్‌నాథ్ వ్యాఖ్యానిం చడంతో అతన్ని తప్పించారు. అమర్‌నాథ్ సచిన్ పై చేసిన వ్యాఖ్యలను మాజీ భారత కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా సమర్థించాడు. గతంలో మాదిరిగా బౌలర్లపై ఆధిపత్యం కనబరచడం లేదని, రిటైర్మెంట్ ప్రకటించాలన్న వాదనను మధ్ధతు పలికాడు.