సద్గురు శివానందమూర్తి కన్నుమూత
వరంగల్:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 గంటల తర్వాత భక్తుల సందర్శనార్ధం ఆశ్రమంలో శివానందమూర్తి భౌతికకాయం ఉంచనున్నారు. శివానందమూర్తి భౌతికకాయాన్ని సందర్శించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు