సమన్వయ కమిటీ సభ్యుల సహకారంతో ముందుకు 

వరంగల్‌ ,మే9(జ‌నం సాక్షి): చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ కమిటీ సభ్యులు కీలక భూమిక పోషించాలని, వారు దగ్గరుండి రైతులకు సహకరించాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు 
అన్నారు. రైతులందరికీ ఒక్క రోజు ముందుగానే స్లిప్‌లు పంపిణీ చేపట్టామని అన్నారు. చెక్కుల పంపిణీ కేంద్రాల వద్ద ఇబ్బంది ఎదుర్కోవాల్సి లేకుండా గ్రామాల్లో ముందుగానే దండోరా వేయించి కార్యక్రమం చేపట్టబోతున్నామని నఅ/-నారు. ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్న రైతుబంధు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు, సీఐ, ఎస్సైలు, టీంలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచనలు ఇచ్చారు. పంపిణీ కేంద్రాల వద్ద మామిడి తోరణాలు కట్టడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పాటలు విన్పించడం లాంటివి చేయాలన్నారు. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ ఏర్పాటు చేయాలని, దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా సూచించారు. చెక్కులు రాని వారికి నచ్చచెప్పి ఎప్పుడు వస్తాయో తెలియచేసి పంపించాలని పీవో సూచించారు. ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
——-