సమస్యల పరిష్కారం కోసమే క్షేత్రస్థాయి పరిశీలన

వెంటనే పరిష్కరించేలా చర్యలు

ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న స్పీకర్‌

భూపాలపల్లి,జూలై18(జ‌నం సాక్షి): క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి పల్లెనిద్ర, బస్తీ ప్రగతినిద్ర ఎంతగానో దోహదపడుతున్నాయని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తాను నిద్ర చేఇన గ్రామాల్లో తెల్లవారితే వార్డులో ఇంటింటా తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకోవడం వల్ల ప్రజల్లో కూడా నమ్మకం కలిగిందన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలను పరిశీలించి కొన్నింటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు. వార్డులో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల సమస్యలను ప్రలు ప్రధానంగా స్పీకర్‌ దృష్టికి తీసుకువస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రం ఒకే వైపు అభివృద్ధి చెందుతోందని తమ ఏరియా కూడా అభివృద్ధి చెందాలని ఇతర ప్రాంతాల వారు స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. మైలారంను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు 100ఎకరాల స్థలాన్ని కేటాయించామని, అక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, ఇతర సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలను ఒకే చోట ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇకపోతే దేవాదుల ప్రాజెక్టునుంచి రామప్ప రిజర్వాయర్‌లోకి వస్తున్న నీటిని రామప్ప విూదుగా గణపసముద్రంలో మళ్లించి 25వేల ఎకరాల సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్‌ అన్నారు. రామప్ప సరస్సు నుంచి గణప సముద్రంలోనికి రామప్ప రిజర్వాయర్‌ నుంచి నీరు మళ్లించేందుకు మూడున్నర కిలోవిూటర్ల వరకు నిర్మిస్తున్న గ్రామిటీ కెనాల్‌ పనులను ఆయన ఇటీవల పరిశీలించారు. రామప్ప రిజర్వాయర్‌ చెరువు నీరు మొగుళ్లపల్లి, రేగొండ, చిట్యాల, గణపురం, టేకుమట్ల మండలాల్లోని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెపారు. రామప్ప నుంచి గణప సముద్రంలోని నీరు వెళ్తున్న క్రమంలో రైతుకు కొన్ని సమస్యలు ఎదరవుతున్నాయని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని వారికి ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసి పనులు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. రైతులు ఎవరైన ఇలాంటి సమస్య తన దృష్టికి తీసుకువస్తే కాట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆగస్టులోగా పనులు పూర్తిచేసి రైతులకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.