సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన
నిర్మల్ బ్యూరో, ఆగస్ట్14,జనంసాక్షి,,, నిర్మల్ జిల్లా కేంద్రంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మినీట్యాక్ బండ్ అంబెడ్కర్ చౌరస్తాలో జానపద కళాకారుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి హాజరై మాట్లాడారు. చక్కటి పాటల ద్వారా స్వాతంత్ర్యము సిద్దించుకున్న విధానాన్ని పాట రూపంలో తెలిపరన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు ఈ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, రాంబాబుతో పాటు కళాకారులు పాల్గొన్నారు.