సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు.
తాండూరు ఆగస్టు 20 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ని సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. డోలారోహణ కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పలువురినిఅకట్టుకున్నాయి.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో చదువు నేర్చుకుంటున్నప్పటికి విద్యార్థులు దేశ సంస్కృతి, సంప్రదాయాలను మరవకూడదని సూచించారు. విద్యార్థి దశ నుంచే గీతా శ్లోకాలను పఠించాలని పేర్కొన్నారు. అల్లరివాడు, గోపికాలోలుడు, యశోద తనయుడు, యోగీశ్వరుడని పేరొందిన శ్రీకృష్ణుని జన్మదిన ఉత్సవాలను వైభవంగా జరుపు కోవడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచారి ఆచార్యులు, మాతాజీల బృందము కమిటీ సభ్యులలో జిల్లా అధ్యక్షులు మల్లేశం, వక్త ప్యాట నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సిరెడ్డి ,జిల్లా సభ్యులు సుబ్బారావు , పాఠశాల కోశాధికారి ప్రభుశంకర్ తదితరులు పాల్గొన్నారు.