సరిహద్దుల్లో చొరబాట్లపై అప్రమత్తం

న్యూఢిల్లీ,జనవరి25(జ‌నంసాక్షి): పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్‌ స్టైక్స్ర్‌ తరవాత కూడా సరిహద్దుల్లో ఇంకా ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. భారత్‌లోకి చొరబడి దాడులు చేసేందుకు సుమారు ఉగ్రవాదులు సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద కాచుకుని ఉన్నారు. గణతంత్రం సందర్బంగా సరిహద్దుల్లో పోరాటాల్లో ఉగ్రవాదులు హతమవుతున్న తీరే ఇందుకు నిదర్శనంగా చూడాలి. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై భద్రతాదళాలు ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నాయి. భారీ సంఖ్యలో ముష్కరులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కూడా భద్రతపై సేకరించిన సమాచారం మేరకు రు దేశంలోకి చొరబడితే విధ్వంసమే అని విరించారని సమాచారం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిన తర్వాత పాక్‌-భారత్‌ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. సర్జికల్‌ స్టైక్స్‌ తర్వాత నియంత్రణ రేఖ వద్ద పాక్‌ సైన్యం తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే.