సర్కార్‌ బడుల్లోనే చేర్పించండి

గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చవద్దు
జనగామ,మే24(జ‌నం సాక్షి): జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యార్తులను చేర్చవద్దని డీఈవో  చెప్పారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించొద్దని, ఒకవేళ చేర్పిస్తే అందుకు విద్యాశాఖ బాధ్యత వహించదని  తెలిపారు. నిబంధనలు పాటించని పాఠశాల యజమానులపై చట్టరీత్యా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరం పిల్లలను చేర్పించే సమయంలో పాఠశాల అనుమతి, ఉపాధ్యాయుల అర్హతలను, వాహనాల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి చేర్పించాలన్నారు. పలు పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాల పంపిణీ, ఉచిత ఏక రూప దుస్తుల పంపిణీ, ఉపకార వేతనాలు అందజేస్తోందని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలో చెల్లించి ఆర్థికంగా నష్టపోయే కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాభివృద్ధి సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.