సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి

జనం సాక్షి నర్సంపేట
సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కోశాధికారి అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రామగుని సుధాకర్ గౌడ్ అధ్యక్షతన గోపా క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన జరుపుకోవాలని తెలిపారు. నేడు గొప్ప ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి గౌడ కులస్తులు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ పవిత్రన్ గౌడ్, వడ్లకొండ సతీష్ గౌడ్, వడ్లకొండ రాజేష్ గౌడ్, వడ్లకొండ శ్రీకాంత్ గౌడ్, జక్కి రాములు గౌడ్, గండి లింగయ్య గౌడ్, తాళ్లపెల్లి వీరాస్వామి గౌడ్, మాడూరి శ్రీనివాస్ గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.