సర్వమత సమ్మేళనంతో రాజనాల శ్రీహరి యజ్ఞం యాగాలు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ (జనం సాక్షి)
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీ గా మార్చిన శుభ సందర్భంగా రంగశాయిపేట లోని ఎలగందుల లక్ష్మీనారాయణ వృద్ధాశ్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ పార్టీ అధ్యక్షుడిగా ముందుకు వెళ్లాలని అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కల్వకుంట్ల తారక రామారావు నియమితులు అవ్వాలని సర్వమత సమ్మేళనంతో యజ్ఞం యాగాలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి గారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆనాడు రాష్ట్రం కోసం ఒక్క అడుగు ఇప్పుడు దేశంలోని పేదల బతుకులు మార్చేందుకు మరోక అడుగు వేసి దేశ రైతును రాజు చేసేందుకు సబ్బండ వర్గాల ఐక్యత కోసం జనం కోసం జగత్తు గర్వపడే దేశ నిర్మాణం కోసం ఒక్క అడుగు విచ్చిన్న శక్తుల గుండెల్లో పిడుగై వచ్చింది భారత రాష్ట్ర సమితి. సబండ వర్గాల ఆశయం లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ మన భారత రాష్ట్ర సమితి పార్టీ అని తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వమతాల సభ్యులు ఎస్ కే గోరే మీయ, దస్తగిరి, ఫ్రాన్సిస్ జాషువా,ఎర్ర మధు, పోలేపాక ప్రసాద్, రామ్ సింగ్, ఉరాన్ సింగ్, తో పాటు వృద్ధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…
Attachments area