సాంకేతిక కారణాలతో తరచుగా పలు రైళ్ల రద్దు చేస్తున్నారు
కాజీపేట బలార్షా సెక్షన్ లో మూడవ రైల్వే లైను దాదాపు పూర్తి కావస్తున్నది. ఈ లైను తో ఈ మార్గంలో రైళ్లు ఆలస్యం లేకుండా వేగంతో, అదనపు ప్యాసింజర్ రైళ్లు మరియు కొన్ని అదనపు హాల్ట్ లతో ప్రయాణం సుఖమయంగా ఆనందంగా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషపడినారు కానీ రైల్వే వారు ఈ ఆశను అడియాస చేస్తున్నారు. దాదాపు సంవత్సరం నుండి ఇంటర్ లాకింగ్ నాన్ ఇంటర్ లాకింగ్ ఇంకా ఇతర సాంకేతిక సమస్యల పేరుతో ఈ మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను తరచుగా రద్దు చేస్తున్నారు మరియు ఆ రద్దులను ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. ఫలితంగా ఏ రైలు ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు రద్దు అవుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైల్వే శాఖ పలు సాంకేతిక సమస్యలతో రైళ్లను రద్దు చేస్తున్నారు కావచ్చు కానీ దీర్ఘకాలంగా రైళ్లను రద్దు చేయడం శోచనీయమైన విషయం. అత్యంత తక్కువ ప్రయాణికుల రైళ్లు ఉన్న ఈ మార్గంలో పలు రైళ్లను పలు దఫాలుగా పలు కారణాలతో రద్దు చేయడం వలన ఈ ప్రాంత ప్రయాణికులు సరైన రవాణా సౌకర్యం లేక అనేక కష్టనష్టాలకు గురి అవుతున్నారు ఫలితంగా ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడం వలన అధిక వ్యయ ప్రయాసాలతో ప్రయాణం అభద్రత తో కూడుకొని ఉంటున్నది. చిత్రమైన విషయం ఈ మార్గంలో కాజీపేట నాగపూర్ లో మధ్య నడిచే ప్యాసింజర్ ను ఎక్స్ప్రెస్ గా మార్చి నాగపూర్ వరకు నడపడం లేదు కొన్ని హాల్ట్ లను కూడా ఎత్తివేసినారు సింగరేణి ప్యాసింజర్ రైలును పుష్ పుల్ గా మార్చడం వలన కొత్తగూడెం నుండి బలహర్షా వరకు వెళ్లవలసిన ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు. రైల్వే వారు ఎన్ని రోజులు ఈ రద్దులను కొనసాగిస్తారో సమగ్ర వివరణాత్మకంగా సమాచారంతో అన్ని రైల్వే స్టేషన్ లతోపాటు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేసిన యెడల ప్రయాణికులు సరియైన సమాచారం తెలుసుకొని వారి ప్రయాణాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో కొనసాగించుటకు వీలుంటుంది. గతంలో నడిచిన అన్ని ప్యాసింజర్ రైళ్లను యధావిధిగా పునరుద్ధరించి ఈ మూడవ లైను సౌకర్యంతో రైళ్ళు ఆలస్యంగా నడవకుండా వేగంగా రవాణా చేసే వీలు ఉండడంతో ప్రయాణికులకు అనుగుణంగా అదనపు కొత్త రైళ్లు నడపాలని అదనపు హాల్ట్ లు కల్పించాలని రైల్వే అధికారులను కోరుతున్నారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా రైల్వే శాఖ వారితో సంప్రదించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రైలు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణిభవన్ హైదరాబాద్
9849592958