సామాజిక పురోగతిలో మహిళలదే కీలకపాత్ర

 

 

 

– జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్ మార్చి 8 (జనంసాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని అమరవరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి తో కలిసి జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచ్ ను, వార్డు సభ్యులను, అంగన్వాడి సిబ్బందిని, ఆశ వర్కర్ల ను స్వయం సహాయక సంఘాల సభ్యులను శాలువాతో సత్కరించారు. బుధవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏర్పాటు అయిన సంక్షేమ పథకాలు అన్నింటిని మహిళల కేంద్ర బిందువుగా అమలు చేస్తున్నారు అన్నారు. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, అమ్మ ఒడి, ఆరోగ్య మహిళా కొన్ని కార్యక్రమాలను తీసుకొని సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. బిడ్డ జనం నుండి వివాహం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. మహిళలు వాటిని ఉపయోగించుకోవడం ద్వారా సమాజంలో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. జగత్ నిర్మాణంలోనూ జగత్ నిర్వహణలోనూ జగత్ యాజమాన్యంలోనూ స్త్రీలు పురుషులతో పాటు సమాన పాత్రను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. మహిళలు చదువుకోవడం ద్వారా ఆర్థిక స్వలంబనను సాధించి సామాజిక పురోగతిలో క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కవిత, ధనమ్మ, పంచాయతీ కార్యదర్శి సైదులు, వి వి కే సైదమ్మ, అంగన్వాడి టీచర్లు విజయలక్ష్మి, అరుణ, వెంకటలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు స్నేహ లత, స్వరూప, ధనమ్మ, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.