సామాజిక సేవల్లో కోవిడ్ వాలంటీర్లు.
ఫోటో రైటప్: నిమ్స్ లో చికిత్స పొందుతున్న బూరం స్వాతి.
బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి)
కరోన వైరస్ వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో సాటి మనుషులను ఆదుకోవడానికి ఏర్పడ్డ కోవిడ్ వలంటీర్స్ వాట్సప్ గ్రూప్ నెన్నెల మండలంలో కోవిడ్ బాధితులనే కాకుండా ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న అందరికి తమకు తోచినంత సహాయం చేస్తూ ఆదుకుంటుంది. నెన్నెల మండలం అని కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చి వారి ఆపదను తమ వారి ఆపదగా భావించి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజా నెన్నెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని బూరం స్వాతి ఫార్మా ప్రవేశ పరీక్ష రాయడానికి వెళుతూ మార్గమధ్యంలో కారుబోల్తా పడి తలకు తీవ్ర గాయలై నిమ్స్ లో చికిత్స పొందుతున్న విషయం సోషల్ మీడియాలో తెలుసుకున్న కోవిడ్ వలంటీర్స్ బృందం స్వాతి కుటుంబానికి నేరుగా రాచర్ల రాజేష్ కు ₹ 28450, కోవిడ్ వలంటీర్స్ గ్రూప్ ద్వారా ₹ 17701 ఫోన్ ద్వారా మొత్తం ₹ 46151 రూపాయలు కోవిడ్ వలంటీర్స్ ద్వారా బాధిత కుటుంబానికి అందించారు. సాటి మనిషి ప్రమాదంలో ఉందని తెలియగానే మానవత్వంతో స్పందించి సహకరించిన మానవతా మూర్తులకు అందరికి పేరు పేరునా కోవిడ్ వలంటీర్స్ కన్వీనర్ జలంపల్లి శ్రీనివాస్, బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.