సామాజిక సేవాల్లో దూ సుకుపోతున్న జడ్పీటీసీ

శివ్వంపేట ఆగస్ట్ 27 జనంసాక్షి :  ఆపద వచ్చిన వారు ఎవ్వరైనా సరే వారు వీరు అనీ చూడకుండా నేనున్నా అనీ ఆ ఆపద సమయంలో తనకు తోచిన వీదంగా సహాయం అందిస్తూ, తనను నమ్ముకున్న నిరాశ్రయుల కోసం వెను వెంటనే స్పందిస్తూ యావత్ మంది ప్రజల మన్ననలు పొందుతున్నారు మన శివ్వంపేట జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా ఆయన సేవలు  అభినందనీయమని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన పర్కిబండ భాస్కర్  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. టీఆరెఎస్ పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ శనివారం బాధిత కుటుంబన్నీ పరామర్శించి తన వంతు సహాయంగా 5 వేల రూపాయలు  ఆర్థిక సాయం అలాగే నిత్యవసర సరుకులు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, ప్రణీత్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ బొద్దుల బిక్షపతి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షఫీ, శ్రీకాంత్ రెడ్డి, మహేష్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.