సామాన్యులకు గుదిబండగా పెగ్రో,గ్యాస్‌ ధరలు

నిత్యం ధరల పెరుగుదలతో గ్రావిూణజీవనం అస్తవ్యస్థం
అల్పాదాయ వర్గాల వారికి భారంగా మారిన ధరలు
న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి): పెట్రో ధరలతో సామాన్య టూ వీలర్లు నడిపేవారు ఎతంగా ఆందోళన చెందుతున్నారో..దేశంలో గ్యాస్‌ వినియోగిస్తున్న మహిళలు కూడా అందే ఆక్రోశంగా ఉన్నారు. మోడీ వచ్చాక సిలిండర్‌ ధర డబుల్‌ కావడమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా మహిళల్లో మోడీ ప్రభ తగ్గుతోంది.
సామాన్యూలకు వంట గ్యాస్‌ ధర పెంపు గుదిబండగా మారింది. ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఏకంగా రూ.
వందల్లో ధరలు పెంచేశారు. దీంతో ప్రస్తుతం గ్యాస్‌ బండ గుదిబండ మాదిరిగా తయారైంది. ఏడాది క్రితం రూ. 700పై చిలుకు ఉన్న వంట గ్యాస్‌ ధర ప్రస్తుతం రూ. 1000 దాటింది. ఏకంగా రూ. 300 పెరగడంతో
సామాన్యులపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వ వైఖరి కారణంగా గ్యాస్‌ పొయ్యిలు పక్క నపెట్టి, క్టటెలతో వంట చేయడం మేలనిపిస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వాలు వంటగ్యాస్‌ ధరలు దించడం ద్వారా సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో వాహనాలు బయటకు తీసే పరిస్థితి లేదు. ఇంతకుపూర్వం రూ. 2, 3 పెంచినప్పుడు ప్రతిపక్షపార్టీల నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఇప్పుడు రూ. 113కు పెరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదు. రోజు ఎంత పెరుగుతుందో కూడా తెలియడం లేదు. వంట నూనెలతో సమానంగా పెట్రోలు ధరలు పెరుగుతుండడం ఆందోళనకరం. మోదీ ప్రభుత్వ హయాంలో అచ్చే దిన్‌ వస్తదని చెప్పారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ప్రజలు చచ్చేదిన్‌ మాత్రం వచ్చాయని వాహనదారులు వాపోతున్నారు. చిన్నాచితక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్న వారికి టూవీలర్‌ తప్పనిసరి కావడంతో పెట్రో ధరలతో పాటు గ్యాస్‌ పెరుగుదలతో బతుకు భారంగా మారింది. నెలనెలా ఇచ్చే వేతనాలే అంతంత మాత్రం. ప్రతి నిత్యం ఉద్యోగరీత్యా వాహనం ఉపయోగించడం తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో వేతనంలో అధిక భాగం పెట్రోలుకు, గ్యాస్‌కే పోతుంది. దీంతో జీతం సరిపోక బతుకు భారంగా తయారైంది. పెట్రోలు ధరలు ఇంకా ఎంత పెరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది. సామాన్యులను ధృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని వేతనజీవులు కోరుతున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు రోజు, రోజుకు పెరుగుతుండడంతో ప్రజలపై పెనుభారం పడు తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల వాహనదారులకు మోయలేని భారంగా మారుతోంది. వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరుగు తుండడంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏడాదిన్నర కాలంలో పెట్రోలుపై రూ. 36, డీజిల్‌పై రూ. 26.58, వంట గ్యాస్‌పై దాదాపుగా రూ. 200 వరకు పెరిగింది. అంతర్జా తీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రభుత్వాలు విధిస్తున్న వివిధ రకాల సుంకాల కార ణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజువారీగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో డీజిల్‌పై లీటర్‌కు రూ. 2, పెట్రోలుపై రూ. 1.5 చొప్పున ధరలు పెరగడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల కారణంగా సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మొన్నటి దాకా కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. టిఫిన్‌ సెంటర్లు, మిర్చి బండీలతో జీవనం సాగిస్తున్న వారు వంట గ్యాస్‌ ధరల పెరుగదల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. చిరుద్యోగాలు, షాపుల్లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు కూడా పెరిగిన పెట్రో లు ధరల కారణంగా మానసికాందోళనకు గురవుతున్నారు. వాహనం బయటకు తీయనిదే పనులు జరగని నేటి రోజుల్లో ప్రభుత్వాలు సుంకాల పేరుతో అధిక భారం మోపుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజానీకం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకో వాలని ఆయా వర్గాల ప్రజలు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా పేద,మధ్యతరగతి ప్రజలు ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.