సామూహిక జాతీయ గీతాలపన విజయవంతం చేయండి.
బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.
ఫోటో రైటప్: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ.
బెల్లంపల్లి, ఆగస్టు9, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో ఇరవై వేల మంది ప్రజలతో సామూహిక జాతీయ గీతాలాపన, మరియు జాతీయ పతాకాలతో మహా ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ పిలుపునిచ్చారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో 13 వ తేదీ శనివారం రోజున బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని నెం – 2 గ్రౌండు లో ఉదయం 9 గంటలకు జాతీయ గీతాలపన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 25000 మంది , విద్యార్థిని విద్యార్థులు, మహిళలు, యువకులు విభిన్న స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, కుల, మత, రాజకీయ, వర్గ, ధనిక, పేద, స్త్రీ, పురుష, భేదాలు లేకుండా ప్రజలందరితో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం నెం – 2 గ్రౌండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు, కొత్త బస్టాండు నుండి నుండి నెం – 2 గ్రౌండ్ వరకు జాతీయతా భావాన్ని పెంపొందించే, నినాదాలతో , స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల వేషధారణలతో, స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించే పాటలతో , ప్రతి ఒక్కరూ ఒక్కొక్క జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో చేపడుతామన్నారు. విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే, విభిన్న రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కనుక ప్రజలందరిలో జాతీయతా భావాన్ని పెంపొందించడానికి , స్వాతంత్ర్య స్పూర్తిని కలిగించడానికి, బెల్లంపల్లి పట్టణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కావున అత్యధిక సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.