సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7పై నిషేధం

samsung-galaxy-note-7విమానాల్లో ప్రయాణికులు సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 తీసుకురావొద్దని భారత విమానయాన శాఖ తెలిపింది. ఇటీవల సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ చేస్తుంటే పేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. విమానాల్లో ప్రయాణికులు సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7కు చార్జింగ్ కూడా పెట్టొద్దని హెచ్చరించింది. అటు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ)కూడా వీటిపై నిషేధం విధించింది. ఎఫ్ఏఏ ఆదేశాలతో నోట్ 7 ఫోన్లను అనుమతించడంలేదని, ప్రయాణికుల భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. గెలాక్సీ నోట్ 7ను ఇదివరకే సింగపూర్, కాంటాస్, వర్జిన్ ఆస్ట్రేలియా ఎయిర్ లైన్స్ నిషేధించాయి. 10 దేశాల్లోని 25 లక్షల గెలాక్సీ నోట్ 7 ఫోన్లను రీకాల్ చేశామని సామ్సంగ్ కంపెనీ తెలిపింది. నోట్ 7 బ్యాటరీలో సమస్య తలెత్తిందని, వినియోగదారులకు కొత్త ఫోన్లను అందజేస్తామని చెప్పింది.