సారు జర జాగ్రత్త గుంతలు ఉన్నాయి గుంతల బాధ నుండి విముక్తి కలిగేది ఎప్పుడో బషీరాబాద్
ఆగస్టు 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి అనగా ఉప విద్యుత్ కేంద్రం నుండి మొదలు కొన్ని గ్రామపంచాయతీ వరకు ఇలాంటి గుంతలు చాలా ఉన్నాయని ఈ గుంతలు పూడ్చి తారు రోడ్డు వేసేది ఎప్పుడు అన్ని ప్రజలు గ్రామస్తులు వాహనదారులు మండిపడుతున్నారు. ఈ దారి నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో మంది అధికారులు వెళుతూ ఉంటారు. మరియు ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వాహనాలు ఎన్నో వెళుతున్నాయి కానీ ఈ రోడ్డు మాత్రం పట్టించుకోరు ఎందుకు ఈ గుంతలు ఈ మురికి నీరు కనబడుటలేదా అని ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పెద్ద వాహనాలు అనగా బస్సులు,లారీలు వెళుతుంటే ఆ యొక్క మురికినీరు ద్విచక్ర వాహనాలపై పడుతుందని ద్విచక్ర వాహనాలు చింతిస్తున్నారు. సారూ ఈ గుంతలను పూడ్చి తారు రోడ్డు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.