సింగన్నగూడెం లు అండర్ పాస్ నిర్మించాలని కలెక్టర్ వినతి పత్రం… సింగన్నగూడెం బైపాస్ రోడ్ నిత్యం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దాటుతున్న ప్రజలు ..
నిత్య ప్రమాదాల అడ్డాగా మారిన సింగన్నగూడెం బైపాస్ రోడ్డు….
భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):—భువనగిరి పట్టణం లోని బైపాస్ రోడ్డు సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ చౌరస్తా వద్ద ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారని అనేకమంది కాళ్లు చేతులు పోగొట్టుకొని అభాగ్యులుగా మిగిలారని వారి కుటుంబాలు దిక్కులేని వారయ్యారని వారికి వివరించడం జరిగింది ఈ రోడ్డుపై నిత్యం అనేకమంది స్కూల్ పిల్లలు రైతులు వ్యవసాయ కూలీలు వృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు దాటుతున్నారని, తెలపడం జరిగింది .ఎన్హెచ్ అధికారులు అండర్పాస్ రోడ్డు నిర్మాణం కోసం సర్వేలు చేసి కాలయాపన చేస్తున్నారని ఈ రోడ్డు యందు ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకొని అమాయక ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కోరడమైనది .ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి అంగళ్ళపల్లి రవికుమార్ సేవదల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేష్ నాయకులు వడిచెర్ల కృష్ణ యాదవ్, పసుపులేటి సంతోష్, నల్గొండ కిషోర్, సాదం రాజు, కురా వెంకటేష్ మొదలగు వారు పాల్గొన్నారు..