సింగరేణి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
-వీడియో కాన్ఫెరెన్స్ లో డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పా)బలరాం
యైటీంక్లయిన్ కాలని మార్చి 09 (జనంసాక్షి):
సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పా దృశ్య మాధ్యమము ద్వారా సింగరేణి ఆస్తుల పరిరక్షణ పై జిఎం విజిలెన్స్, జిఎం ఎస్టేట్స్, జిఎం పర్సనల్ (వెల్ఫేర్ అండ్ ఆర్.సీ), జిఎం సివిల్, జిఎం సెక్యూరిటీ మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో గురువారం సమీక్షా సమావేశము నిర్వహించారు. సింగరేణి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఏరియాల వారిగా కమిటీలు వేసి ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పా) బలరాం అన్నారు. కంపనీ క్వార్టర్, ఖాళీ స్థలాలను అనుమతి లేకుండా దురాక్రమణ పాల్పడితే వారిపై వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశములో ఏరియా జనరల్ మేనేజర్ ఐత మనోహర్, డిజిఎం(పర్సనల్) జి.రాజేంద్రప్రసాద్, డిజిఎం సివిల్ ధనుంజయ, డిజిఎం వర్క్ షాప్ ఎర్రన్న, సీనియర్ సెక్యూరిటీ అధికారి పివి.రమణ, సీనియర్ పర్సనల్ అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు.