సింగరేణి కాంట్రాక్టు కార్మికులంతా దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాలి
– ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రసాద్
–కార్మికద్రోహానికిపాల్పడ్డ జాతీయకార్మికసంఘాలు
–విప్లవకార్మికసంఘాల ఆరోపణ.
టేకులపల్లి ,సెప్టెంబర్ 27( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు కార్మికులంతా దీర్ఘకాలిక పోరాటానికిసిద్ధం కావాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి .ప్రసాద్ పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలోగత 18 రోజులుగా సమ్మె చేస్తున్నా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, అట్లాంటి యాజమాన్య వైఖరిని నిరసిస్తూ భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాల్సిన తరుణంలో కార్మిక వర్గాన్ని ఉద్యమ పదములో తీసుకోవాల్సిన సమయంలోజాతీయ సంఘాలు పూర్తిగా వైఫల్యం చెంది సింగరేణి యాజమా న్యానికి బ్రోకర్లుగా వ్యవహరించారనీ ఐఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రసాద్ ,జిల్లా నాయకులు రాయండ్ల కోటిలింగం ,నోముల భానుచందర్ విమర్శించారు. టేకులపల్లి సింగరేణి కోటర్స్ కార్మికులతో బెల్ట్ క్లీనింగ్ ఇంకా ఇతర సెక్షన్ల కార్మికులతో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ జీవో నెంబర్ ఎంఎస్ 22 ను గెజిట్ చేయడం కోసం ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకునే విధంగా జాతీయ సంఘాలు వ్యవహ రించాయి అన్నారు. జాతీయ సంఘాలు పూర్తిగా లొంగుబాటు వైఖరి ప్రదర్శించాయి అని, ప్రధానంగా ఏఐటీయూసీ, సిఐటియు సంఘాలు టిఆర్ఎస్ కుమ్మక్కై కార్మిక ద్రోహానికి పాల్ప డ్డాయి. మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతి స్తున్న ఏఐటియుసి ,సిఐటియు సంఘాలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం రాష్ట్ర ప్రభు త్వంపై ఒత్తిడి పెంచలేకపోయాయి. నాలుగు జాతీయ కార్మిక సంఘాల చీకటి ఒప్పందం మూలంగా సింగరేణి క�