సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపు అమలు పరచాలి

టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతన పెంపు వెంటనే అమలు పరచాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఏఐటీయూసీ సింగరేణి వర్కర్స్ యూనియన్ నాయకులు, కె, సారయ్య అన్నారు. సింగరేణి కాలనీ టేకులపల్లి లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 18 రోజులుగా కొనసాగిన నిరవధిక సమ్మెకు పరిష్కారం లో 12 డిమాండ్లు పైన సానుకూలత తెలిపినందున, అందులో ముఖ్యంగా వేతన పెంపును వెంటనే అమలు చేయాలి, కనీస వేతనాలు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు 22 ను సత్వారం అమలు చేయాలని, సింగరేణి సిఎండి లేఖ ను రాసినట్లు చర్చలలో తెలిపారు. ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ చీప్ లేబర్ కమిషనర్ కి, యజమాన్య ప్రతినిధులు, తక్షణం సింగరేణి వ్యాపితంగా కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జి రామ్ చందర్, జి శ్రీను, ఐ శ్రీరాములు, బి వీరన్న , బి వీరభద్రం టి మధు, లక్ష్మణ్ ,శివయ్య ,సూర్య, చిట్టిబాబు ,ప్రసాద్, బాబు, సోమయ్య, విజయ, నాగమణి, ఎర్రమ్మ ,కౌసల్య ,రమణ ,మౌనిక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.