సింగరేణి కార్మికుడు మృతి
గోదావరిఖని,జనంసాక్షి: కరీంనగర్ సింగరేణి ఎంట్రీ గనిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడు ఎండీ గాలిబ్ (35) నిన్న రాత్రి మృతి చెందాడు. గనిలోని 75 లెవల్ వద్ద రోడ్డు పనులు చేయిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం గోదావరిఖనిలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.