సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో వసతుల కల్పన – జి ఎం దేవేందర్ . . . .
తాండూరు సెప్టెంబర్ 20 జనంసాక్షి
మంగళవారం రోజున బెల్లంపల్లి ఏరియా సింగరేణి ప్రభావిత ప్రాంతం అయిన తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామంలోని అర్ అండ్ అర్ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని బెల్లంపల్లి ఏరియా జి ఎం శ్రీ జి దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కనీస వసతులు, వైద్య సేవలను అందించేందుకు సింగరేణి సంస్థ సర్వదా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాబోయే కాలంలో గోలేటి ఓపెన్ కాస్ట్ రానుందన్నారు. oc వస్తే ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువగా కేటాయించ బడి అభివృద్ధి చెందనుందన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రుగ్మతలను ఎప్పటికీ దాచుకోవద్దన్నారు. ఆరోగ్య సమస్యలను వైద్యులకు చెప్పుకొని చికిత్స తీసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. సింగరేణి వైద్య సిబ్బంది నర్సాపూర్, అబ్బాపూర్ గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, పండ్లు , బిస్కెట్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి కుర్సేంగా జంగు బాయి , MPP శ్రీ pranay గారు, ZPTC శ్రీ బానయ్య , కొత్త పల్లె MPTC శ్రీమతి యశోద , So to Gm శ్రీ KHN గుప్తాగారు, TBGKS ఏరియా ఉపాద్యక్షులు శ్రీ ఎం శ్రీనివాస్ రావు గారు, Dy Cmo డాక్టర్ శౌరి , బి పి ఎ ఓ సి 2 పి ఓ శ్రీ ఉమా కాంత్ , BPOC 2 మేనేజర్ శ్రీ మహేష్ , INTUC నాయకులూ పేరం శ్రీనివాస్ , ఉపసర్పంచ్ శ్రీ పర్వత్ రావు , AGM ఎం శ్రీ తిరుమల్ రావు , DGM (civil) శ్రీ ఆర్ సతీష్ బాబు , పర్సనల్ మేనేజర్ శ్రీ ఐ లక్ష్మణ్ రావు, డివైపిఏమ్ శ్రీ రెడ్డి మల్ల తిరుపతి , ఎస్టేట్ అధికారిణి శ్రీమతి నవనీత , డాక్టర్ లలిత , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.