సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీపీ..

నెరడిగొండ జులై30(జనంసాక్షి):
సిఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.శనివారం రోజున మండల కేంద్రంలోని ఎంపీపీ. ఆఫీసు ఆవరణలో  మండలంలోని బుగ్గారం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదేశానుసారంతో సిఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అమలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ జిపి సర్పంచ్లు పార్టి నాయకులు జనార్ధన్ రమేశ్ ఎంపీటీసీలు కృష్ణ లబ్దిదారులు  తదితరులు పాల్గొన్నారు.