సిగ్నల్స్‌ అందక నిలిచిన ‘బాద్‌షా’ సినిమా

ఆగ్రహంతో ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన అభిమానులు

ఉప్పల్‌, జనంసాక్షి: సినిమా  మధ్యలో నిలిచిపోయిందని ఆగ్రహించిన ప్రేక్షకులు ఉప్పల్‌లోని శ్రీకృష్ణ థియేటర్‌లోని అద్దాలు, ఇతర  ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గురువారం శ్రీకృష్ణ థియేటర్‌లో ‘బాద్‌షా’ చిత్రప్రదర్శన జరుగుతోంది. సాయంత్రం ఆరుగంటల ఆటకు చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. ఇదే సమయంలో సాంకేతిక ఏర్పడింది. దీంతో శాటిలైట్‌ సిగ్నల్‌ అందలేదు. ఇది అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో రెచ్చిపోయిన కొందరు దాడి చేసి థియేటర్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రేక్షకులకు టిక్కెట్ల డబ్బును తిరిగి ఇప్పించేయడంతో సమస్య సద్దుమనిగింది.