సిపిఎస్‌ రద్దు కోరుతూ బైక్‌ ర్యాలీ

కడప,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉద్యోగులకు గుదిబండగా మారిన సిపిఎస్‌ను రద్దు చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేలులో శుక్రవారం ఉపాధ్యాయులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ బాబురెడ్డి, ఫ్యాప్టో నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.