సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష
రామకృష్ణాపూర్, (జనంసాక్షి): సిపిఐ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఒక్కరోజు నిరాహార దీక్షను ప సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోఉన్నసమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని,బీడంపింగ్ యార్డ్, స్మశానవాటికలుబీఏర్పాటుచేయాలని, వర్షాకాలంలో గుంతలుగా ఏర్పడిన రోడ్లకు మరమ్మత్తు చేయాలని, ఆసరాపెన్షన్లు బ్యాంకులద్వారాఇవ్వాలని, హెల్త్ సెంటర్లో పశువుల హాస్పిటల్ లో డాక్టర్ను నియమించాలని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలని,
ప్రతి ఇంటికి మిషన్ భగీరథనీళ్లు ఇవ్వాలని,ఆసరా పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని,గ్రంథాలయం పునరుద్దించాలని, ఇరవై రెండు వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.
ఈ దీక్షలో జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, పట్టణ కౌన్సిల్ సభ్యులు ఇప్పకాయల లింగయ్య,
ఎండిఅక్బర్అలీ, వనం సత్యనారాయణ,మిట్టపల్లిపౌల్,నక్క వెంకటస్వామి, కాదండి సాంబయ్య, మెరుగురాజేషం, బైర కొమురెల్లి, కట్ల రమేష్, మామిడి గోపి,
ఈరవేన రవీందర్, మోతుకూల రాజు,
మాదాసు శంకర్,ఎగుడ మొండి,
మామిడాల సత్తయ్య, చొప్పదండి దుర్గ,
గోవిందుల రమేష్, కోదాటి లక్ష్మణరావు,
ఎండి హుస్సేన్, ఎనుగందుల చిరంజీవి,
జంగపల్లిసత్యనారాయణ, పోతర్లరాములు, నకీర్తీ ఐలయ్య,ఎంజాల శ్రీనివాస్,
గుమాస మల్లేష్ దీక్షలో పాల్గొన్నారు.
అనంతరం స్థానిక సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు.