సిపిఐ 24వ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని గోడప్రతుల ఆవిష్కరణ..

నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్ 25(జనంసాక్షి):
 భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సిపిఐ 24వ జాతీయ మహాసభలు 2022 అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరుగుతున్నాయని అక్టోబర్ 14 న జరిగే బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రధానంగా దేశంలో ప్రజా,కార్మిక వ్యతిరేక మితవాద, ఫాసిస్టు, మతోన్మాద శక్తులు పెరుగుతున్నాయని, ప్రజాస్వామికి హక్కులను కాలరాస్తున్నాయని,సరళీకరణ, ప్రైవేటీకరణ పేరిట ప్రజలపై గుదిబండ మోపుతున్నారని అన్నారు .నోట్ల రద్దు, జిఎస్టి, బ్యాంకుల విలనీకరణ, అగ్నిపత్ వంటి అనాలోచిత విధానాలతో జనజీవనం అస్తవ్యస్తమైందని , పెట్రోల్, డీజిల్, గ్యాస్,నిత్యవసర వస్తువుల ధరలు, రైల్వే,బస్సు చార్జీలు విపరీతంగా పెరిగాయని ఈ సమస్యల పరిష్కారం కోసం మరిన్ని భవిష్యత్తు ఉద్యమాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయని 2022 అక్టోబర్ 14 విజయవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే భూమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు వై ఓమయ్య  అడ్డికే రాజేశ్వర్ వై రాజిరెడ్డి కే రాజన్న ఎండి రఫిక్ ఖాన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.