సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 28( జనం సాక్షి) న్యాల్కాల్ మండలం లో ఎమ్మెల్యే మణిక్ రావు పర్యటన చేసి అభివృద్ధి పనులు ప్రారంభించారు. 2 కోట్ల 40 లక్షల రూపాయల తో సీసీ పనులకు శంఖుస్థాపన, ఆసరా పింఛన్లు పంపిణీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మండలం లోని
మేటల్ కుంట, న్యంతబాద్, హద్నుర్, రుక్మాపుర్, ముంగి, మిర్జపుర్, టేకుర్, న్యాలకల్ ఇబ్రహీంపూర్, చినిగేపల్లీ, అత్నుర్, డప్పుర్ గ్రామాలలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ధృవపత్రాలను బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు.ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఆత్మ కమిటీ ఛైర్మెన్ పెంటరెడ్డి, వైస్ ఎంపీపీ గౌస్, మండల అధ్యక్షులు రవీందర్, మాజీ మండల అద్యక్షులు నర్సింహ రెడ్డీ, ఎంపీటీసీ లు సలీం, సర్పంచులు పీటర్, సరిత దేవిదాస్, వీ రాజ్ కుమార్, అమీర్, మల్రెడ్డి, మహిపాల్, చంద్రయ్య, నిరంజన్ రెడ్డీ, ఉప సర్పంచ్ లు, పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు రత్నం, ఇజ్రాయేల్ బాబీ, శ్రీకాంత్ రెడ్డీ, వినోద్, ఇమ్రాన్, చంద్రశేఖర్, షబ్బీర్, బక్క రెడ్డీ, ప్రవీణ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు