సి సి కెమెరాలకు జియో ట్యాగింగ్

ఎసై రజినీకాంత్
ఖానాపూర్ రూరల్ 6 ఆగష్టు జనం సాక్షి: ఖనపూర్లోని వివిధ నగర్ లో ఉన్న సి సి కెమెరాలకు శనివారం ఎసై రజనీకాంత్ ఆధ్వర్యంలో జియో ట్యాగింగ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ తనాలు,అపరిచితుల కదలికలు తెలుసుకోవడానికి,వివిధ నగర్లో ఉన్న సి సి కెమెరాలను జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు.ఇంటి యజమానులు మీ ఇంటి ఆవరణలో సి సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు