సి సి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ధూళిమిట్ట (జనంసాక్షి) జులై 30: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ వేణుగోపాలస్వామి వీధిలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చొప్పరి వరలక్ష్మి సాగర్ ముదిరాజ్ తన నిధుల నుండి 10 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. సందర్భంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో మరిన్ని సిసి రోడ్లు వేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి చెట్కూరి కళ్యాణి కమలాకర్ యాదవ్, ఉమ్మడి మద్దూరు మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చొప్పరి సాగర్ ముదిరాజ్ , ఉప సర్పంచ్ సంపత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,
తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు నాగులపల్లి కుమార్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..