సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీమునిపల్లి, ఏప్రిల్ 01, జనంసాక్షి: అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆదేశాల  మేరకు  శనివారం నాడు మండంలోని  ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన కటికే షాహీన్ బేగంకు రూ.  57,500.  కటికే మైతబ్ కు రూ. 60వేలకు సంబంధించి  సీఎంఆర్ఎఫ్ చెక్కులను  లబ్దిదారులకు జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ అందజేశారు. అనంతరం జడ్పీటీసీ   మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు యాదయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ తుడుం దుర్గయ్య, బీఆర్ఎస్ గ్రామ  అధ్యక్షుడు మాణయ్య, నాయకులు తుడుం సుభాష్, వార్డు సభ్యులు నాయికోటి జగదీశ్వర్, తుడుం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.