సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే శంకర్ నాయక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం…
కేసముద్రం అక్టోబర్ 8 జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం రోజున టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీపీ చంద్రమోహన్,జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు హాజరై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కృషి వల్ల కేసముద్రం మండలంలో గతంలో ఎస్టి సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల,బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మించి ప్రారంభించినారు.ఇప్పుడు మహాత్మా బాపు జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించబోతున్నారు కావున వారు చేసిన కృషిని కొనియాడుతూ వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశామన్నారు.ఈ సందర్భంగా కేసముద్రం మండల ప్రజల తరఫునుంచి వారికి కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు తరాల సంపత్,కార్యదర్శి భైరబోయిన అశోక్,వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి, నజీర్ అహ్మద్,కమటం శ్రీను,వీరు నాయక్,వద్దిరాజు దేవేందర్,ఊకంటి యాకూబ్ రెడ్డి,నీలం దుర్గేష్,సంకు శ్రీనివాస్ రెడ్డి,మోడం రవీందర్ గౌడ్,కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి,గంధసిరి సోమయ్య,పురం రమేష్,శతకోటి నరేష్,ఆరుద్రపు శ్రీనివాస్,శరత్ యాదవ్,శంకర్,బాలు, బద్రు,బీమా,కొండేటి రవి,రాజు,దుబ్బాక వెంకన్న,కొమర మల్లు,తారా సింగ్, అన్నపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.