సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

తొర్రూరు 18 సెప్టెంబర్ (జనంసాక్షి )
తొర్రూరు డివిజన్ కేంద్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ చిత్రపటాలకు టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని గిరిజన ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మాట్లాడుతూ ఈ నెల 17న జాతీయ సమైక్యత దినోత్సవంలో భాగంగా హైదరాబాదులో ఆదివాసి కొమరం భీం,సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవం అనంతరం జరిగిన గిరిజన మహాసమ్మేళనంలో కెసిఆర్ మాట్లాడుతూ కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని,వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో దారి చేస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు.భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత మరో సంవత్సరానికి తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించిందని,అప్పటి నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంతో తెలంగాణ ప్రజలకు కూడా స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు.ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడినట్లు పేర్కొన్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు,బహుజనులకు,అణగారిన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని తెలిపారు.తెలంగాణలో అభివృద్ధి అనేది ఎండమావిగా మారిన నేపథ్యంలో ప్రజానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో నాలుగు కోట్ల తెలుగు ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. అనేక అవరోధాలు ఎదుర్కొని అనేక పోరాటాల ఫలితంగా ఏర్పాటు చేసుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నాడని అన్నారు.దీనిలో భాగంగా పరిపాలన సౌలభ్యత కోసం నూతనంగా జిల్లాల ఏర్పాటుతో పాటు 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనులను పాలకులుగా చేసిన ఘనత కేసిఆర్ దేనని తెలిపారు. అదేవిధంగా గిరిజనులు స్వయం సమృద్ధి సాధించేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్ గిరిజన జనాభా కనుగునంగా 10 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం కుట్రతో ఆ బిల్లును పక్కన పెట్టిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులకు ఎట్టి పరిస్థితుల్లో నైన న్యాయం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేంద్రంతో సంబంధం లేకుండానే రాష్ట్రమే గిరిజనులకు10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని తక్షణమే జి ఓ ను జారీ చేస్తామని తెలిపారని అన్నారు. ఈ నిర్ణయం గిరిజనుల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని విద్యా ఉద్యోగ పరిపాలనపరంగా ఇది గిరిజనులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్థానిక గిరిజన,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన రాష్ట్ర కన్వీనర్ ధరావత్ రాజేష్ నాయక్, నాయకులు ధరావత్ జై సింగ్ నాయక్, గిరిజన సర్పంచ్ లు మాలోత్ కాలు నాయక్, బానోత్ యాకమ్మ కిషన్ నాయక్, జాటోత్ కౌసల్య బోజ్య,జాటోత్ విజయ్ కుమార్,హపావత్ సురేష్,గుగులోతు సరస్వతి, పాడ్యా రమేష్,జాటోత్ శారదా రమేష్, లకావత్ శోభన యాకూబ్, సోమ్లా నాయక్, ఎంపీటీసీ జాటోత్ సుజాత రాజేందర్,టిఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు స్వామి నాయక్, పట్టణ అధ్యక్షుడు రమేష నాయక్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.