సీఎం దళిత బంధు కాదు..దళిత ద్రోహి:రాఘవులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌25: దళితుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానని చెబుతున్న సీఎం కిరణ్‌ దళిత ద్రోహి అని సీపీఐ కార్యకర్త రాఘవులు తెలిపారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు అన్ని విషయాలలో సీఎం అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు,బిల్లులు మోతలు అధికంగా ఉన్నాయని ఆయన అరోపించారు.విద్యుత్‌ సమస్య తీర్చే వరకు ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తానని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ ,బీజేపీ పార్టీలను ఓడించేందుకు ఇతర రాజకీయ శక్తులతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.