సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ.

– చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, జులై 27, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి శంకరమ్మకు మంజూరైన రూ. 60 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రజలందరినీ తన సొంత బిడ్డలుగా భావించి ఆపదలో ఉన్నవారికి అడ్డుకుంటున్నారని తెలిపారు. గతంలో ఆసుపత్రి పాలైతే ఉన్న ఆస్తుల అమ్ముకొని చికిత్స చేయించుకునే వారని, కానీ ఇప్పుడు మనకు సీఎం కేసీఆర్ ఉన్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అనే ధైర్యంతో ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ, నాయకులు గడ్డం భీమా గౌడ్, ఇందూరి రమేష్ పాల్గొన్నారు