సీఐఎన్‌ఎఫ్‌ సేవలు కీలకం

హైదరాబాద్‌ఉ : ఎయిర్‌ఫోర్స్‌లు, మెట్రో రైల్వే స్టేషన్లలో సీఐఎస్‌ఎఫ్‌ సేవలు కీలకంగా మారాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి ఆర్పీఎస్‌ సింగ్‌ అన్నారు. హకీంపేటలోని సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. దేశంలో సీఐఎస్‌ఎఫ్‌ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని చెప్పారు. దేశ రక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సేవలు నిరుపమానమైనవిగా ఆర్పీఎస్‌సింగ్‌ వర్ణించారు.