నెరడిగొండఆగస్టు22(జనంసాక్షి):సిజనల్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎఎన్ఎం గంగమణి అన్నారు.సోమవారం రోజున మండల కేంద్రంలోని వాగ్దరి గ్రామంలో సర్పంచ్ గుమ్ముల గంగాదేవి ఉప సర్పంచ్ మోహన్ ఆధ్వర్యంలో మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఎఎన్ఎం గంగమణి ఆశావర్కర్ అనిత తో కలసి గ్రామ ప్రజలకు పిల్లలకు పరీక్షలు నిర్వహించి జ్వర పిడుతులకు ఉచిత మందులు అందించారు.ప్రతిఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాధిపట్ల అవగాహన కల్పించారు.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పాత కుండీలలో నీటినిల్వ ఉండకుండా చూసుకోవాలని,నీటి నిల్వల వలన దోమల లార్వాచే దోమలు అధికంగా పెరిగి వాటి వలన మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని,వ్యక్తి గత పరిశుభ్రతను పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ గంగామణి ఆశవర్కర్ అనిత అంగన్వాడీ టీచర్లు జీపీ సర్పంచ్ ఉప సర్పంచ్ మోహన్ సెక్రెటరీ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.