సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 -ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్ జూలై 22(జనంసాక్షి): వర్షాకాలం సీజన్లో వచ్చే అంటు వ్యాధులు ,విష జ్వరాలు ,డెంగ్యూ జ్వరం వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ అన్నారు . శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులోనీ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించారు.ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ సందర్బంగా వైద్యులతో కలిసి పలువురికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,వైస్ చైర్మన్ ఖలీల్, కౌన్సిలర్ తోంటి శ్రీనివాస్,కావాలి సంతోష్ ,నాయకులు జన్నరపు శంకర్,కొక్కుల ప్రదీప్, పనాగంటి రాజేందర్, కౌట మహేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.