సీజనల్ వ్యాధుల పై అవగాహన ర్యాలీలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్
ముష ర్రఫ్ ఫారుఖీ.
నిర్మల్ బ్యూరో, జూలై22,జనంసాక్షి,,, జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో సీజనల్ వ్యాధుల పై శుక్రవారం మెడికల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ, ఎంపీవో లతో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో కలసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ గ్రామం లో, మండల పరిధిలో మున్సిపాలిటీ వార్డులలో శనివారం డెంగ్యూ వ్యాధి పై అవగాహన ర్యాలీ నిర్వహించాలని అన్నారు.
భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షాకాలం కావడం, అందులోనూ భారీ వర్షాలు కురిసినందున సీజనల్ వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నివాస ప్రాంతంలోనూ సీజనల్ వ్యాధుల నివారణకు అవకాశం ఉన్న మేరకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామ పంచాయతీల వారీగా ప్రతి నివాస ప్రాంతంలో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని అన్నారు.
వారానికి రెండు సార్లు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.
రోడ్ల పై నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ఇంటితో పాటు, పరిసరాల ను శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు రాకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలని పేర్కొన్నారు.
మల్టీ లెవెల్ ప్లాంటేషన్ ల పై ప్రత్యేక శ్రద్ద వహించాలి.
హరితహారం లో భాగంగా లక్ష్యాలను పూర్తి చేయాలని, నిర్దేశించిన లక్ష్యాలకంటే ఎక్కువ గా మొక్కలు నాటి సంరక్షించాలని అదనపు కలెక్టర్ ఎంపీడీఓ లను ఆదేశించారు.
పల్లె ప్రకృతి వనాలు బృహత్ పల్లె ప్రకృతి వనాలు, మల్టీ లెవెల్ ప్లాంటేషన్, తదితర ఆగస్టు 10లోపు పూర్తి చేయాలని, అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
ప్రత్యేక అధికారి పర్యవేక్షణ లో పక్కడ్బెందిగా నిర్వహించాలని అన్నారు.
ప్రతీ మండలాల వారిగా ఒక్కొక్కరి ని మండలాల ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.