సీజన్ వ్యాధులపై ప్రైవేటు ల్యాబ్ టెక్నిషన్లకు అవగాహన కార్యక్రమం…

రోగ నిర్ధారణ పరీక్షలు నాణ్యత లేకపోతే కఠిన చర్యలు..

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్,సుధాకర్ లాల్…
నాగర్ కర్నూల్ ఆర్సీ22(జనంసాక్షి):శనివారము సీజనల్ వ్యాధులపై ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్లకు అవగాహన కార్యక్రమం కాన్ఫరెన్స్ హాల్ న్యూ కలెక్టరేట్ నాగర్ కర్నూల్ లో నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్,సుధాకర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.వర్షాలు కురుస్తున్నందువల్ల సీజనల్ వ్యాధులపై నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ లాప్ టెక్నీషియన్లకు
అన్ని రకాల వ్యాధులపై అవగాహన కల్పించి వారి వద్ద వచ్చిన రోగ నిర్ధారణ పరీక్షలు ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమాచారం అందించాలని జిల్లా వైద్యాధికారి తెలిపారు.జిల్లా ఉపా వైద్యాధికారి డాక్టర్,వెంకదాస్ మాట్లాడుతూ,సీజన్ వ్యాధుల సమాచారం కొరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కమాండ్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లకు తెలిపారు.జిల్లా సహాయ మలేరియా అధికారి ఆర్.శ్రీనివాసులు మాట్లాడుతూ,రోగ నిర్ధారణ పరీక్షలు నాణ్యమైనవిగా ఉండాలని లేదంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
జిల్లా వైద్యాధికారి డాక్టర్,సుధాకర్ లాల్.నాగర్ కర్నూల్ డివిజన్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్,వెంకట దాస్ తో పాటు
నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలో ఉన్న 50మంది ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లు
డాక్టర్,ప్రదీప్ కుమార్.DPMO రేనయ్య.జిల్లా సహాయ మలేరియా అధికారి ఆర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

తాజావార్తలు